రాజమౌళి, ఎన్టీఆర్, రాంచరణ్ చిత్రంపై మరో లేటెస్ట్ న్యూస్!

  • 'బాక్సర్' అన్న టైటిల్ పెట్టే ఆలోచన
  • టాలీవుడ్ వర్గాల్లో కొత్త చర్చ
  • మరచిపోలేని చిత్రంగా తయారు చేయనున్న రాజమౌళి
టాలీవుడ్ లో లేటెస్ట్ హాట్ న్యూస్ గా నిలిచిన రాజమౌళి, ఎన్టీఆర్, రాంచరణ్ చిత్రం గురించి మరో న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతోంది. బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందన్న విషయం చక్కర్లు కొడుతున్న వేళ, అదే పేరును చిత్రానికి పెట్టాలని రాజమౌళి ఆలోచిస్తున్నట్టు సమాచారం. తెలుగు సినీ ప్రియులకు మరచిపోలేని అనుభూతిని అందించేలా సినిమాను తయారు చేయాలని భావిస్తున్న రాజమౌళి దీనికి 'బాక్సర్' అన్న టైటిల్ కరెక్టుగా ఉంటుందని భావిస్తున్నట్టు సమాచారం.

ఈ సినిమాకు 'యమధీర' అని టైటిల్ పెట్టాలని అభిమానుల నుంచి సూచనలు అందుతున్న సంగతి తెలిసిందే. సినిమా కథేంటి? నటీనటులు ఎవరు? ఎంత బడ్జెట్ తో తీస్తున్నారు? టైటిల్ ఏంటి? అన్న విషయాల్లో ఎలాంటి అధికారిక న్యూస్ బయటకు రాకున్నా, ఈ సినిమాపై వచ్చే ప్రతి చిన్న న్యూస్ కూడా వైరల్ అవుతోంది.
Go Back to Shorts
Rajamouli
Ramcharan
ntr
new movie

More Telugu News